నేషనల్ క్యాంప్ జాబితాలో డోపింగ్ అథ్లెట్ పేరు..

by Vinod kumar |
నేషనల్ క్యాంప్ జాబితాలో డోపింగ్ అథ్లెట్ పేరు..
X

న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడి నిషేధిత కాలాన్ని ఎదుర్కొంటున్న ఓ అథ్లెట్‌ పేరు నేషనల్ క్యాంప్‌ జాబితాలో ఉండటం మీరెప్పుడైనా విన్నారా? జిమ్నాస్టిక్స్ క్రీడకు భారత్‌లో అంతగా ప్రాధాన్యత లేదు. కానీ నేషనల్ క్యాంప్‌కు ఎంపికైన అథ్లెట్ల జాబితాలో డోప్ కళంకిత దీపా కర్మాకర్ పేరును జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జీఎఫ్ఐ) చేర్చింది. ఈ నేషనల్ క్యాంప్ మే 23న ప్రారంభం కానుంది. రాబోయే ఆసియా చాంపియన్‌షిప్, ఆసియన్ గేమ్స్, ఇతర అంతర్జాతీయ క్రీడల్లో మహిళల ఆర్టిస్టిక్ ఈవెంట్ కోసం మహిళల ప్రాబబుల్స్‌ను ఈ క్యాంప్‌లో ఎంపిక చేయనున్నారు.

2016 రియో ఒలింపిక్స్‌లో ఈమె మహిళల వాల్ట్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచి భారత జిమ్నాస్టిక్స్ ముఖ చిత్రాన్నే మార్చేసింది. ప్రస్తుతం ఈమె 21 నెలల నిషేధాన్ని ఎదుర్కొంటోంది. ఈ నిషేధిత కాలం జూలై 10న ముగుస్తుంది. 2021లో సేకరించిన శాంపిల్‌లో ఆమె హిజెనమైన్ అనే నిషేధిత ఉత్ర్పేరకాన్ని వాడినట్టు తేలింది. దీంతో వరల్డ్ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ ఆమెపై నిషేధపు వేటు వేసింది.

Advertisement

Next Story

Most Viewed