స్టీవ్ స్మిత్ భారీ స్కెచ్.. రంగంలోకి ఇద్దరు స్టార్ ప్లేయర్స్..

by Vinod kumar |
స్టీవ్ స్మిత్ భారీ స్కెచ్.. రంగంలోకి ఇద్దరు స్టార్ ప్లేయర్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌తో జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ స్టీవ్ స్మిత్ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్థానంలో ఎవరు ఉంటారన్నది జట్టుకు సమస్యగా మారింది. స్టార్క్ గాయం కారణంగా మొదటి రెండు టెస్టుల్లో ఆడలేదు. మూడో టెస్టుకు ముందు కూడా అతను పూర్తిగా ఫిట్‌గా లేడని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మంగళవారం విలేకరుల సమావేశంలో స్మిత్ స్పందించాడు. మిచెల్ స్టార్క్ ఫిట్‌గా ఉన్నాడని, ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని స్పష్టం చేశాడు.

స్టార్క్ తొలిసారి ఈ సిరీస్‌లో ఆడనున్నాడు. అలాగే ఆల్ రౌండర్ కెమెరూన్ గ్రీన్ కూడా ఫిట్ గా ఉన్నాడని ప్రకటించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవర్ని అడించాలి అనే విషయంలో తమకు ఆప్షన్లు ఉన్నాయని స్మిత్ తెలిపాడు. “గ్రీన్, స్టార్క్ ఇప్పుడు ఫిట్‌గా ఉన్నారు. దీనివల్ల మనం ఎవరితో కావాలంటే వారితో వెళ్లే అవకాశం ఉంటుందని స్మిత్ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా నిలవాలంటే గెలవాలి..

తొలి రెండు టెస్టుల్లోనూ ఓడియిన ఆసీస్ జట్టు.. సిరీస్ గెలవాలన్న కల చెదిరిపోయింది. ఇప్పుడు సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశం మాత్రం ఉండగా.. ఇండోర్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవక తప్పదు. అదే సమయంలో ఇండోర్ టెస్టులో గెలిచిన వెంటనే టీమ్ ఇండియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంటుంది.

Advertisement

Next Story