టీమిండియాతో తొలి వన్డేకు ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్స్ ఔట్

by Vinod kumar |
టీమిండియాతో తొలి వన్డేకు ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్స్ ఔట్
X

దిశ, వెబ్‌డెస్క్: మొహాలీ వేదికగా టీమిండియాతో రేపు జరుగబోయే తొలి వన్డేకు ముందు ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ జట్టు స్టార్‌ ఆటగాళ్లు మిచెల్‌ స్టార్క్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ గాయాల కారణంగా తొలి వన్డేకు దూరం కానున్నారు. ఈ విషయాన్ని ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ నిర్ధారించారు. గజ్జల్లో నొప్పి కారణంగా స్టార్క్‌.. చీలిమండ గాయం కారణంగా మ్యాక్సీ తొలి మ్యాచ్‌కు దూరంగా ఉంటారని స్టార్క్‌ తెలిపారు. దీంతో భారత్‌తో తొలి వన్డేకు స్టార్క్‌, మ్యాక్స్‌వెల్‌ మినహా తొలి వన్డేలో ఆసీస్‌ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య సెప్టెంబర్‌ 22, 24, 27 తేదీల్లో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి వన్డే మొహాలీలో, రెండో వన్డే ఇండోర్‌లో, మూడో వన్డే రాజ్‌కోట్‌లో జరుగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి.

టీమిండియా:

కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ

ఆస్ట్రేలియా:

పాట్ కమిన్స్ (కెప్టెన్‌), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్‌, మిచెల్ మార్ష్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్ , మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

Advertisement

Next Story