నాకు ఒలంపిక్స్‌లో ఆడాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన క్రికెటర్

by Gantepaka Srikanth |
నాకు ఒలంపిక్స్‌లో ఆడాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన క్రికెటర్
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ లవర్స్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2023లో ఆ దేశానికి ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ సాధించిపెట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అంతేకాదు.. ఎన్నో క్లిష్ట తరమైన మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించారు. ప్రస్తుతం ఆల్‌ రౌండర్‌గా, ఆసీస్‌ జట్టుకు కెప్టెన్‌గా కమిన్స్ కొనసాగుతున్నారు. ఇటీవల కమిన్స్ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టారు. తనకు లాస్ ఏంజెలిస్ వేదికగా జరిగే ఒలంపిక్స్‌లో ఆడాలని ఉందని తెలిపారు. వచ్చే ఒలంపిక్స్ నాటికి తనకు 35 ఏళ్లు వస్తాయని.. ఆసీస్ తరపున ఆడుతాను అనే అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆ సమయంలో ఎవరు ఫిట్‌గా ఉంటే వారికే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. కాగా, లాస్ ఏంజెలిస్ వేదికగా జరిగే వచ్చే ఒలంపిక్స్‌లో క్రికెట్‌ను తిరిగి ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story