D Gukesh : గుకేశ్ కు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన స్టాలిన్

by M.Rajitha |
D Gukesh : గుకేశ్ కు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన స్టాలిన్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ చెస్ ఛాంపియన్(World Chess Champion) గా నిలిచిన భారత చెస్ ప్లేయర్ డి గుకేశ్(D Gukesh) కు తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(Tamilanadu CM MK Stalin).. గుకేశ్ కు రూ.5 కోట్ల భారీ నజరానా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అతి చిన్న వయసులోనే గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్(World Chess Championship) సాధించడం పట్ల స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని విజయాలు సాధించి, దేశానికి రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మరోవైపు.. ఫైనల్లో డిగ్ లిరెన్(Dig Liren) పై గుకేశ్ విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్ గా నిలవడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. సెలెబ్రెటీల నుంచి సామాన్యుల దాకా జయహో గుకేశ్ అంటూ పోస్టులు , ట్వీట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed