Asia Cup: పాకిస్థాన్‌పై ఘన విజయం.. ఫైనల్‌లో భారత్‌తో తలపడనున్న శ్రీలంక

by Satheesh |
Asia Cup: పాకిస్థాన్‌పై ఘన విజయం.. ఫైనల్‌లో భారత్‌తో తలపడనున్న శ్రీలంక
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక వేదికగా జరుగుతోన్న మహిళల ఆసియా కప్‌ టోర్నీలో ఇప్పటికే భారత్ ఫైనల్‌ చేరగా.. టీమిండియాను ఢీ కొట్టే మరో జట్టు ఏదనే దానిపై ఉత్కంఠ వీడింది. సెమీస్-2లో పాకిస్థాన్‌పై అతిథ్య శ్రీలంక విజయం సాధించి ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం రాత్రి డంబుల్లా స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ ఉమెన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 రన్స్ చేశారు.

పాక్ ఓపెనర్ మునీబా అలీ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఫెరోజ్ 25, నిదాదార్ 23, ఫాతిమా సనా 23 పరుగులు చేశారు. ప్రభోధని, కవిషా దిల్హారీ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం 141 పరుగుల మోస్తారు టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి గెలుపు కైవసం చేసుకుంది. శ్రీలంక స్టార్ బ్యాటర్ ఆటపట్టు 63 పరుగులు చేసి శ్రీలంక ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. పాక్ బౌలర్లలో సైదా ఇక్బాల్ 4 వికెట్లతో ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. 28వ తేదీన జరిగే ఫైనల్ పోరులో టైటిల్ కోసం భారత్, శ్రీలంక తలపడనున్నాయి.



Next Story