కోహ్లీ కెరీర్‌లో కీలక ఘట్టం.. ఆ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

by Web Desk News |
కోహ్లీ కెరీర్‌లో కీలక ఘట్టం.. ఆ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
X

టీమిండియా జట్టు వరుస విజయాలతో జోరుమీదున్నది. టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్‌లో భాగంగా బీసీసీఐ వెస్టిండీస్, శ్రీలంకతో టీ20లతో పాటు టెస్టు సిరీస్‌లను ప్లాన్ చేసింది. భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టాక ఇప్పటివరకు టీమిండియా ఒక్క ఓటమిని కూడా చవిచూడలేదు. వరుసగా టీ20 మ్యాచులను గెలుస్తూ వచ్చింది. మొన్న వెస్టిండీస్, నిన్న శ్రీలంక జట్టు మన కుర్రాళ్లు ఉతికారేశారు. కొత్త కుర్రాళ్ల కలయికతో అటు బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ బ్లూ ఆర్మీ పటిష్టంగా ముందుకు సాగుతోంది.

బెంగళూరు : శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 4వ తేది నుంచి 8 వరకు మొహాలి వేదికగా భారత్ vs శ్రీలకం మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత మార్చి 12 నుంచి 16 వరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రెండవ టెస్టు జరగనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్ సేన టెస్టు సిరీస్‌పైనా కన్నేసింది. అయితే, ఈ టెస్టులో సీనియర్ క్రికెటర్లు చతేశ్వర్ పూజరా, అజింకా రహానే దూరమయ్యారు. ప్రస్తుతం వీరు దేశవాలీ రంజీట్రోఫీలో ఆడుతున్నారు.

కోహ్లీ కెరీర్‌‌లో మైలురాయి..

వెస్టిండీస్ సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ పది రోజుల పాటు సెలవులో ఉన్నాడు. తాజాగా శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్బంగా మళ్లీ జట్టులోకి వచ్చాడు. తొలి టెస్టు మ్యాచ్ కోసం ఇప్పటికే కోహ్లీ ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. కోహ్లీ రాకతో జట్టుపై అంచనాలు మరింత పెరిగాయి. టీమిండియా కెప్టెన్‌గా తప్పుకున్నాక కోహ్లీ ఆటతీరులో చాలా మార్పు వచ్చిందని, దూకుడు తగ్గించాడని పలువురు సీనియర్లు విమర్శలెక్కుపెట్టారు. అయితే, శ్రీలంకతో జరిగే టెస్టు కోహ్లీ కెరీర్‌లో కీలకఘట్టం అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన కోహ్లీ ఈ మ్యాచ్‌తో తన కెరీర్‌లో 100 టెస్టులు ఆడిన 12 భారతీయ క్రికెటర్‌గా సరికొత్త రికార్డును లిఖించనున్నాడు. ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన కోహ్లీ 50.39 సగటుతో 27 సెంచరీలు సాధించి 7,962 పరుగులు చేశాడు.అయితే, గత 28 నెలలుగా కోహ్లీ ఇంతవరకు ఒక్క అంతర్జాతీయ సెంచరీ కూడా చేయలేదు. ఒకవేళ 100వ టెస్టులో కోహ్లీ సెంచరీ సాధిస్తే మొహాలీ టెస్ట్‌ అతని కెరీర్‌లో నిజంగా గుర్తుండిపోనుంది.

దూకుడు పెంచిన అయ్యర్..

బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ దూకుడు పెంచాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో వరుసగా మూడు అర్థసెంచరీలు సాధించి తనకు ఎదురులేదని ప్రూవ్ చేసుకున్నాడు. మొన్నటివరకు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అయ్యర్.. కోహ్లీ రాకతో నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. పూర్తి ఫిట్‌గా ఉన్న అయ్యర్ టెస్టు సిరీస్‌లో ఎటువంటి రికార్డు క్రియేట్ చేస్తాడో వేచిచూడాల్సిందే.

శుభ్‌మన్ గిల్, విహారీ చాన్స్ ఎవరికి?

శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో మిడిలార్డర్‌లో శుభ్‌మన్ గిల్‌ని పరిశీలిస్తున్నామని సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ తెలిపారు. టెస్టు ర్యాంకింగ్స్‌లో గిల్ 3వ ర్యాంక్‌ను ఆక్రమించగా, విరాట్ కోహ్లీ 4వ ర్యాంక్‌లో ఉన్నాడు. హనుమ విహారి 5వ స్థానంలో ఉండగా.. టెస్టు ఆరంగేట్రంలో శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో పాటు T20లలో వరుసగా 3 అర్ధ సెంచరీల సాధించాక హనుమ విహారి కంటే ముందు స్థానంలో అయ్యర్ నిలిచాడు.

టీమిండియా స్క్వాడ్ :

రోహిత్ శర్మ (కెప్టెన్), ప్రియాంక్ పంచల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ (డబ్ల్యూకే), కేఎస్ భరత్ (డబ్ల్యూకే), రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, సౌరభ్ కుమార్, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, మొహమ్మద్. షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్).

Advertisement

Next Story