- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిత్తుగా ఓడిన జట్టు.. శ్రీలంక కెప్టెన్ సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్ల తేడాతో గెలిచిన కివీస్.. తాజాగా ముగిసిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో శ్రీలంక టెస్టు జట్టు కెప్టెన్ కరుణరత్నే కీలక నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే నెలలో జరగనున్న ఐర్లాండ్ టెస్టు సిరీస్ తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లుగా ప్రకటించాడు. ఇదే విషయాన్ని లంక బోర్డుకు తెలిపినట్లుగా కరుణరత్నే వెల్లడించాడు. అయితే అతని నిర్ణయం పట్ల లంక సెలెక్టర్లు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
2019లోది నేష్ చండిమాల్ స్థానంలో తొలిసారి శ్రీలంక టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన కరుణరత్నే.. కెప్టెన్‌గా తొలి సిరీస్‌లో సౌతాఫ్రికాపై చారిత్రక సిరీస్ సాధించాడు. మొత్తం 26 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన కరుణరత్నే అందులో లంక జట్టుకు 10 విజయాలను, 7 డ్రాలు, 9 పరాజయాలను అందించాడు. ఇక ఇప్పటివరకు 84 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అతను 39.94 సగటుతో ఓ డబుల్ సెంచరీ, 14 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీల సాయంతో 6230 పరుగులు చేశాడు.