శ్రీలంక.. గోవింద..గోవిందా! వన్డే ప్రపంచకప్ లో నేరుగా ఆడే ఛాన్స్ మిస్

by Shiva |
శ్రీలంక.. గోవింద..గోవిందా! వన్డే ప్రపంచకప్ లో నేరుగా ఆడే ఛాన్స్ మిస్
X

దిశ, వెబ్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ 1996 విశ్వ విజేత శ్రీలంక జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. మాజీ ఛాంపియన్లకు ఈ సారి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ ఆడాలంటే అంతకంటే ముందు పసికూనలతో కలిసి ‘క్వాలిఫై రౌండ్’ ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం కివీస్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను 2-0తో కోల్పోవడంతో ఆ జట్టు నేరుగా ప్రపంచ కప్ ఆడే అవకాశాన్ని కోల్పోయింది.

కివీస్ తో హమిల్టన్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో న్యూజిలాండ్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 41.3 ఓవర్లలో 157 పరుగులే చేసి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కివీస్ 32.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు విజయం సాధించింది. లంక ఈ మ్యాచ్ ఓడిపోవడంతో వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు కోల్పోయింది.

శ్రీలంక ప్రపంచకప్ లో ఆడాలంటే జూన్ నుంచి జింబాబ్వే వేదికగా జరిగే క్వాలిఫయర్స్ మ్యాచ్ లను ఆడాల్సి ఉంటుంది. శ్రీలంకతో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్, ఐర్లాండ్, వెస్టిండీస్, ఐసీసీ అసోసియేట్ దేశాలు క్వాలిఫై రౌండ్స్ ఆడతాయి. నెదర్లాండ్స్ తో సౌతాఫ్రికా రెండు వన్డేల్లో గెలుస్తేనే ఆ జట్టు వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధిస్తుంది. 44 ఏళ్ల తరువాత లంక జట్టు క్వాలిఫై రౌండ్ ఆడుతుండటం గమనార్హం. భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్ కప్ కు ఇది వరకే భారత్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్టు నేరుగా అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed