ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో జాక్‌పాట్ కొట్టిన నితీశ్.. ఎంత పలికాడో తెలుసా?

by Harish |   ( Updated:2024-05-17 21:19:57.0  )
ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో జాక్‌పాట్ కొట్టిన నితీశ్.. ఎంత పలికాడో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరపున సత్తాచాటుతున్న విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) వేలంలో జాక్ పాట్ కొట్టాడు. ఏపీఎల్ మూడో సీజన్‌కు సంబంధించిన వేలాన్ని గురువారం నిర్వహించారు. ఈ వేలంలో నితీశ్‌ను గోదావరి టైటాన్స్‌ కొనుగోలు చేసింది. అతని కోసం భారీ ధర రూ.15.60 లక్షలు వెచ్చించింది. ఏపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కాగా.. నితీశ్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్‌గా నిలిచాడు.

గతేడాది హైదరాబాద్ జట్టు నితీశ్‌ను రూ.20 లక్షలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అతను 7 ఇన్నింగ్స్‌ల్లో 239 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. కాగా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీఎల్ తొలి రెండు సీజన్లు విజయవంతమయ్యాయి. 2022లో కోస్టల్ రైడర్స్, గతేడాది రాయలసీమ కింగ్స్ విజేతగా నిలిచాయి. ఈ టోర్నీలో ఆరు జట్లు పోటీపడనున్నాయి. జూన్ 30 నుంచి జూలై 13 వరకు మూడో సీజన్ జరగనుంది.

Advertisement

Next Story