సింధు జోరు.. ‘స్పెయిన్ మాస్టర్స్‌’లో క్వార్టర్స్‌లోకి ఎంట్రీ

by Swamyn |
సింధు జోరు.. ‘స్పెయిన్ మాస్టర్స్‌’లో క్వార్టర్స్‌లోకి ఎంట్రీ
X

దిశ, స్పోర్ట్స్: మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జోరు కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో విజయం సాధించిన సింధు.. ప్రీక్వార్టర్స్‌లోనూ సత్తాచాటింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ హువాంగ్ యు-హసన్‌‌‌‌‌పై 21-14, 21-12 తేడాతో సునాయస విజయం సాధించింది. ఫలితంగా క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరగనున్న క్వార్టర్స్‌లో థాయిలాండ్ ప్లేయర్ సుపనిద కాటెథాంగ్‌తో తలపడనుంది. ఇక, మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-సిక్కి రెడ్డిల జోడీ యూఎస్‌కు చెందిన లీ అలిసన్- పి.స్మిత్‌పై 22-20, 21-18తేడాతో గెలుపొంది క్వార్టర్స్‌లోకి చేరుకుంది. వీరితోపాటు మెన్స్‌ డబుల్స్‌లోనూ ధ్రువ్ కాపిలా-అర్జున్ జోడీ సైతం ప్రీక్వార్టర్స్‌లో విజయం సాధించింది. ఇదిలా ఉండగా, పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ నిరాశపర్చాడు. తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి వెనుదిరిగాడు. జపాన్ ఆటగాడు తకహషీతో జరిగిన పోరులో 18-21, 15-21తేడాతో ఓటమిపాలయ్యాడు.

Advertisement

Next Story