వారిని రిటైర్ అవ్వాలనడం కరెక్ట్ కాదు : సౌరవ్ గంగూలీ

by Vinod kumar |
వారిని రిటైర్ అవ్వాలనడం కరెక్ట్ కాదు : సౌరవ్ గంగూలీ
X

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023లో టీమ్ ఇండియా ఘోరపరాజయన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో భారత ఓటమికి టాప్ ఆర్డర్ వైఫల్యమే ప్రధాన కారణమని పలువురు మాజీ క్రికెటర్స్ అభిప్రాయపడ్డాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో విఫలమైన పుజారా, విరాట్ కోహ్లీ ఇక టెస్టులకు వీడ్కోలు పలకాలని ఫ్యాన్స్ మండిపడ్డారు. చెత్త షాట్లు ఆడి ఔటైన వీళ్లు టెస్టులకు పనికి రారన్నారు. అయితే ఈ అభిప్రాయాలతో బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, టీమ్ ఇండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ విభేదించాడు. కేవలం ఒక్క ఓటమితో ఆటగాళ్లపై ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదన్నాడు.

'ఒక ఓటమి చూసిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు. భారత్ వద్ద ఎప్పుడూ మంచి ట్యాలెంట్ ఉంటూనే ఉంది. కానీ అప్పుడే కోహ్లీ, పుజారాను పక్కన పెట్టేయాలనడం కరెక్ట్ నిర్ణయం కాదని సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో కొత్త కుర్రాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. 'దేశవాళీల్లో కొందరు సత్తా ఉన్న కుర్రాళ్లు కనిపిస్తున్నారు. వాళ్లకు అవకాశాలు ఇస్తేనే కదా ఎలా ఆడతారో తెలిసేది. యశస్వి జైస్వాల్, రజత్ పటీదార్ ఎవరైనా అంతే' అని గంగూలీ తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed