ఫాస్ట్ బౌలింగ్ అంత ఈజీ కాదు.. టీమిండియా పేసర్‌పై సౌరవ్ గంగూలీ ఆసక్తికర కామెంట్స్

by Vinod kumar |   ( Updated:2023-01-11 14:02:35.0  )
ఫాస్ట్ బౌలింగ్ అంత ఈజీ కాదు.. టీమిండియా పేసర్‌పై సౌరవ్ గంగూలీ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై సౌరవ్ గంగూలీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పదే పదే గాయపడటం సర్వత్రా చర్చ తలెత్తుతోంది. తాజాగా ఈ అంశంపై బీసీసీఐ మాజీ చైర్మన్, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. బుమ్రా పదే పదే గాయపడటం భారత జట్టుకు సమస్యలు తెచ్చిపెడుతోందని, అతడు టీమ్‌కు మంచి ఆస్తి అని అన్నారు. ఫాస్ట్ బౌలర్లు తరచూ గాయపడుతుంటారని.. ఫాస్ట్ బౌలింగ్ చేయడం అంత సులభమేం కాదని గంగూలీ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేసినప్పటికీ వెన్ను నొప్పి బాధించడంతో జట్టుకు మళ్లీ దూరమైన విషయం తెలిసిందే. దీంతో మరోసారి అభిమానులు నిరాశకు గురయ్యారు. అసలే ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఆడనున్న తరుణంలో బుమ్రా ఈ విధంగా జట్టుకు దూరం కావడం ఫ్యాన్స్ కలవరపరుస్తోంది.

Advertisement

Next Story