- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూఎస్ ఓపెన్ టైటిల్ విజేత ఆసక్తికర వ్యాఖ్యలు. Iga Swiatek
న్యూయార్క్: ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్-2022 టోర్నీ విజేతగా నిలవడం ఒక్కింత ఆశ్చర్యం కలిగించినా.. చాలా సంతోషకరంగా ఉందని పోలెండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వైటిక్ ఆదివారం అన్నారు. యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌లో ట్యూనీషియా ప్లేయర్ ఆన్స్ జాబెర్‌ను 6-2,7-6(5) తేడాతో ఇగా స్వైటిక్ ఓడించి విజేతగా నిలిచింది. అనంతరం మీడియా సమావేశంలో స్వైటిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా స్వైటిక్ మాట్లాడుతూ..'యూఎస్ ఓపెన్-2022 విజేతగా నిలవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సీజన్ ప్రారంభంలో నేను ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) నిర్వహిస్తున్న ఈవెంట్లలో కొన్నింట్లో మాత్రమే బాగా ఆడుతానని అనుకున్నాను.
అలా ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీ ఫైనల్స్ వరకు రాణించగలిగాను. మొదట్లో అసలు యూఎస్ ఓపెన్ టోర్నీకి సెలక్ట్ అవుతానా? కానా? అనే భయం ఉండేది. కానీ యూఎస్ ఓపెన్‌లో సెలక్ట్ అయ్యాను. యూఎస్ ఓపెన్‌లో ఫైనల్స్ వరకు వచ్చి టైటిల్ గెలుస్తానని అస్సలు ఊహించలేదు. టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆకాశమే హద్దుగా అనిపించింది. ఒక్కింత ఆశ్చర్యంగా అనిపించినా.. చాలా సంతోషంగా ఉంది.' అని పేర్కొన్నారు. కాగా, యూఎస్ ఓపెన్ ట్రోఫీ అందుకున్న తొలి పొలెండ్ క్రీడాకారిణిగా స్వైటెక్ రికార్డు సృష్టించారు. ఇది తన మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2020, 2022లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకుంది.