Paris Olympics : ఒలింపిక్స్‌లో తొలి రౌండ్‌లో సింధు విజయం.. ఫైనల్‌కు చేరిన షూటర్‌ రమిత

by Ramesh N |
Paris Olympics : ఒలింపిక్స్‌లో తొలి రౌండ్‌లో సింధు విజయం.. ఫైనల్‌కు చేరిన షూటర్‌ రమిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లోనే సునాయాసంగా విజయం సాధించింది. మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి నబాబా అబ్దుల్ రజాక్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నబాబా అబ్దుల్ సింధుకు పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం 29 నిమిషాల్లోనే వరుసగా రెండు సెట్లలో మాల్దీవ్స్ క్రీడాకారిణిని సింధు ఓడించింది. రెండు సెట్లలో 21-9, 21-6 తేడాతో సింధు విజయం పొందింది. గ్రూప్ స్టేజ్‌లో బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టినాతో పీవీ సింధు తలపడనుంది.

ఫైనల్‌కు షూటర్ రమిత

భారత స్టార్ షూటర్ రమితా జిందాల్‌ పారిస్‌ ఒలింపిక్స్‌‌లో సత్తాచాటింది. మహిళల 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో రమితా ఫైనల్‌కు చేరుకుంది. మొత్తం 631 పాయింట్లు సాధించి 5వ స్థానంలో ఫైనల్‌కు చేరింది.

Advertisement

Next Story