- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గిల్ చేతికి గుజరాత్ పగ్గాలు.. కత్తి మీద సాములాంటిదే..
న్యూఢిల్లీ: గుజరాత్ టైటాన్స్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. వచ్చే సీజన్‌లో గుజరాత్‌ను శుభ్‌మన్ గిల్ నడిపించబోతున్నాడు. హార్దిక్ పాండ్యా ముంబై గూటికి చేరడంతో గుజరాత్ టైటాన్స్ సోమవారం తమ కొత్త కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను నియమించింది. ‘వచ్చే సీజన్‌లో 24 ఏళ్ల గిల్ ధైర్యం, సమర్థతతో జట్టును నడిపించనున్నాడు. గిల్ నీ కొత్త ఇన్నింగ్స్‌కు శుభాకాంక్షలు’ అని ఫ్రాంచైజీ తెలిపింది.
గుజరాత్ కెప్టెన్‌గా నియామకమవడం పట్ల గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ చేపట్టడం పట్ల సంతోషంగా, గర్వంగా ఉంది. నన్ను నమ్మి జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఇచ్చినందుకు ఫ్రాంచైజీకి ధన్యవాదాలు. జట్టును నడిపించడానికి నేను ఎదురుచూస్తున్నాను.’ అని గిల్ చెప్పుకొచ్చాడు.
కాగా, 2018లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన గిల్.. 2021 వరకు కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత గతేడాది కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ అతన్ని జట్టులోకి తీసుకుంది. పాండ్యా సారథ్యంలో అరంగేట్ర సీజన్‌లోనే గుజరాత్ టైటిల్ గెలుచుకోగా.. జట్టు విజయాల్లో గిల్ కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచ్‌ల్లో 483 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లోనూ గుజరాత్ ఫైనల్‌కు చేరుకోవడంలోనూ గిల్‌ది కీలక పాత్రే. 17 మ్యాచ్‌ల్లో 890 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.
ఇక, భారత జట్టులో అన్ని ఫార్మాట్లలో గిల్ టాప్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న అతను ఫ్యూచర్ కెప్టెన్‌గా కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్‌లను కాదని గుజరాత్ గిల్‌కు పగ్గాలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఐపీఎల్‌లో గిల్ తొలిసారిగా ఓ జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు.
అయితే, సారథిగా అతనికి పెద్ద అనుభవం లేదనే చెప్పాలి. 2018 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అతను.. దేశవాళీలో 2019 దులీప్ ట్రోఫీలో భారత్ బ్లూ జట్టుకు, అదే ఏడాది దేవధర్ ట్రోఫీలో భారత్ సి జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.
2020లో న్యూజిలాండ్ పర్యటనలో భారత్ ఏ జట్టును నడిపించిన అనుభవం ఉన్నది. ఐపీఎల్‌లో వరుసగా రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరిన గుజరాత్‌ను నడిపించడం గిల్‌కు కత్తి మీద సాములాంటిదే. మరి, వచ్చే సీజన్‌లో అతను జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.