- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
2023లో గిల్ పెట్టుకున్న లక్ష్యాలివే?.. చాలా వరకు సాధించాడు
న్యూఢిల్లీ : కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలా మంది కొత్త ఏడాదిలో తాము సాధించాలనుకునే లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. చాలా మంది ప్రారంభంలో ఆ దిశగా అడుగులు వేసి ఆ తర్వాత లైట్ తీసుకుంటారు. కొందరు మాత్రమే సీరియస్‌గా తీసుకుని ఏడాదిపాటు శ్రమించి తమ లక్ష్యాలను సాధిస్తారు. ఆ జాబితాలో టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా ఉంటాడు. 2023 ప్రారంభంలో అతను పెట్టుకున్న గోల్స్ గురించి ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు. ‘భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేయాలి.. ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ నెగ్గాలి. వరల్డ్ కప్ గెలవాలి.. నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలి.’ అని 2023 రెజల్యూషన్స్ గురించి తాను రాసుకున్న పేపర్‌ను షేర్ చేశాడు. ‘2023లో ఎన్నో అనుభవాలు, ఫన్, అభ్యాసలతో నిండిపోయింది. ఈ సంవత్సరం అనుకున్న విధంగా సాగలేదు. కానీ, నేను లక్ష్యాలకు దగ్గరగా వచ్చాను. రాబోయే సంవత్సరం సవాళ్లతోపాటు అవకాశాలను తెస్తుంది. 2024లో లక్ష్యాలను చేరుకుంటామని ఆశిస్తున్నా.’అని రాసుకొచ్చాడు. కాగా, గిల్ రెజల్యూషన్స్ పెట్టుకున్న వాటిలో చాలా వరకు అచీవ్ చేశాడు. క్రికెట్ కెరీర్ పరంగా గిల్ 2023లో అద్భుత ప్రదర్శన చేశాడు. భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో 8 సెంచరీలతో కోహ్లీ ముందుండగా.. గిల్ 7 సెంచరీలు బాదాడు. ఇందులో న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ కూడా ఉంది. వన్డేల్లో 60 సగటుతో 1,584 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో ఓ సెంచరీ చేశాడు. మొత్తంగా ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో మాత్రం గిల్ ముందున్నాడు. ఈ ఏడాది గిల్ 2,154 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ గిల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. 890 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి.. ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అంతేకాకుండా, పాండ్యా ముంబై గూటికి చేరడంతో గుజరాత్ పగ్గాలు గిల్ చేపట్టబోతున్నాడు.