ఆ సమయంలో చాలా బాధపడ్డా : Shreyas Iyer

by Vinod kumar |
ఆ సమయంలో చాలా బాధపడ్డా : Shreyas Iyer
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. దాదాపు ఐదు నెలల తర్వాత ఆసియా కప్‌తో జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. గాయం నుంచి ఇంత తొందరగా కోలుకుంటాడని తాను ఊహించలేదని అయ్యర్ అన్నాడు. అయితే రికవరీ సమయంలో తాను ఎదుర్కొన్న సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే అయ్యర్ గాయంతో బాధపడుతున్న సమయంలో.. తన మానసిక పరిస్థితి, బెంగళూరులోని ఎన్‌సీఏ క్యాంపులో రికవరీ, అతడ్ని సపోర్ట్ చేసిన వారి గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

తాను గాయం కారణంగా చాలా ఇబ్బంది పడ్డాడని.. తన కాలు చిన్న వేలుకి తగిలిన గాయం విపరీతమైన నొప్పిని కలిగించిందని అయ్యర్ గుర్తు చేసుకున్నాడు. "గాయం తర్వాత నేరుగా ఇంటికి వెళ్లి, పది రోజులు విశ్రాంతి తీసుకున్నాను. ఓ రోజు డాక్టర్ వచ్చి పరిస్థితిని చూసి.. సర్జరీ అవసరమని చెప్పారు. ఇక సర్జరీ తర్వాత నేను లండన్‌లో మూడు వారాలు ఉన్నాను. ఈ తర్వాత బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాను.

నాకు ఇదంతా రోలర్ కోస్టర్ రైడ్‌లా అనిపించింది. కానీ సర్జరీ తర్వాత మూడు నెలలు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. ఈ కఠిన సమయంలో నా కుటుంబ సభ్యులతో సహా.. ఎన్‌సీఏలో సిబ్బంది నాకు మద్దతుగా నిలబడ్డారు. ఫిట్​నెస్ టెస్ట్ కోసం రన్నింగ్ సెషన్‌లు ప్రారంభించాను. ఇక గతం గురించి, భవిష్యత్​ గురించి ఆలోచించను. ఇప్పుడేం చేయాలనేదానిపైనే దృష్టి సారిస్తా. ఇంత త్వరగా గాయం నుంచి కోలుకుంటానని అనుకోలేదు. జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడం నిజంగా ఆనందంగా ఉంది" అని అయ్యర్ అన్నాడు.

Advertisement

Next Story