ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. యువ బ్యాటర్ ఔట్

by Vinod kumar |
ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. యువ బ్యాటర్ ఔట్
X

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పి గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని టీమ్ ఇండియా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ బుధవారం వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్‌ ప్రారంభానికి ముందు అయ్యర్‌‌కు వెన్నునొప్పి తిరగబెట్టడంతో అతను బ్యాటింగ్‌కు రాలేదు. వెంటనే బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని స్కానింగ్ కోసం పంపించింది.

ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ‌లో ఉన్న అయ్యర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఐపీఎల్-16 ప్రారంభానికి ఇంకా 15 రోజులు మాత్రమే ఉండటంతో లీగ్‌లో ఫస్టాఫ్ మ్యాచ్‌లకు అతను దూరమయ్యే అవకాశం ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుకు అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా, మూడు వన్డేల సిరీస్‌‌లో భాగంగా రేపు ముంబై వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.

Advertisement

Next Story