వీసా సమస్యలు ఎదుర్కొని.. ఎట్టకేలకు భారత్‌లో టెస్ట్ మ్యాచ్ అరంగేట్రం చేశాను : షోయబ్ బషీర్

by Mahesh |
వీసా సమస్యలు ఎదుర్కొని.. ఎట్టకేలకు భారత్‌లో టెస్ట్ మ్యాచ్ అరంగేట్రం చేశాను : షోయబ్ బషీర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టులో 20 ఏళ్ల ఇంగ్లాండ్ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన అతను.. పాకిస్థాని మూలానికి చెందిన వాడు. అతను ఇంగ్లాండ్ జట్టు తరఫున భారత్‌లో ఆడిన తన మొదటి మ్యాచ్ లో రోహిత్ శర్మ వికెట్ తీసుకున్నాడు. అలాగే ఇదే మ్యాచులో మొత్తం మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఇంగ్లండ్ ఎటాక్‌లో అందరికంటే ఎక్కువ ఓవర్లు వేసినందుకు ఆనందగా ఉంది. "నా మొదటి వికెట్‌ రోహిత్ శర్మది కావడం నాకు చాలా ప్రత్యేకమైనది. అతను స్పిన్ లో గొప్ప ఆటగాడు. అయినప్పటికీ తన ఓవర్‌లో అవుట్ కావడం నా అదృష్టం అని చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే.. ఇంతను ఇంగ్లాండ్ టూర్‌లో భాగం కావడానికి ముందు ఓ వివాదంతో వార్తల్లోకి ఎక్కాడు. పాకిస్తాన్ మూలాలు ఉన్న అతను.. మొదట వీసా సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత జట్టులో స్థానం దక్కడంతో భారత్ చేరాడు. దీనిపై అతను మాట్లాడుతూ.. "నేను వీసా పొందుతానని నాకు ఎప్పుడో తెలుసు. "నేను వీసా పొందుతానని నాకు ఎప్పుడో తెలుసు" అని అతను చెప్పాడు. కాగా అతను ఈ మ్యాచ్ కు ముందు భారత్ కు రావడానికి పాకిస్థానీ మూలాలకు చెందిన వాడని కావడంతో వీసా సమస్యలు ఎదుర్కొన్నాను.. కానీ చూడండి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఎట్టకేలకు నేను నా అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ అరంగేట్రం చేశాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు. నేను ఇప్పుడు భారత్‌కు వచ్చి నా టెస్ట్ అరంగేట్రం చేయడం నాకు నమ్మశక్యంగా లేదు అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story