Shikhar Dhawan: విజయ్ లియో పాటకు శిఖర్ ధావన్ స్టెప్పులు.. వీడియో వైరల్‌

by Vinod kumar |
Shikhar Dhawan: విజయ్ లియో పాటకు శిఖర్ ధావన్ స్టెప్పులు.. వీడియో వైరల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఆయన మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు మాత్రమే కాదు, మామూలు సమయంలోనూ ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇక సోషల్ మీడియాలోనూ ఆయన చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఆ మధ్య ఓ బాలీవుడ్ మూవీలోని మెరిశాడు. వీలు దొరికినప్పుడల్లా శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉంటాడు. ఆయన రీల్స్‌కి కూడా ఫ్యాన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తాజాగా తమిళ స్టార్‌ హీరో తలపతి విజయ్‌ లేటెస్ట్‌ మూవీ ‘లియో’లో పాటకు స్టెప్పులేశాడు.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ధావన్‌ జోష్‌‌కి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. సూపర్ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శిఖర్ ధావన్ టీమ్‌లో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో యువ క్రికెటర్లు సత్తా చాటుటుండటంతో ధావన్‌కి టీమ్‌లో చోటు దక్కడం కష్టమనే అనిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed