బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ అరుదైన రికార్డు.. మూడో క్రికెటర్‌గా..

by Vinod kumar |
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ అరుదైన రికార్డు.. మూడో క్రికెటర్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఫీట్‌ను దాటాడు. మూడు ఫార్యాట్‌లో కలిపి 14,000 రన్స్ మార్క్‌ను అధిగమించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరిగిన మూడో వన్డేలో షకీబ్‌ ఈ రికార్డు సాధించాడు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో ఈ ఫీట్‌ను సాధించిన మూడో క్రికెటర్‌గా షకీబ్‌ రికార్డుల్లోకెక్కాడు. 416 మ్యాచ్‌ల్లో షకీబ్‌ ఈ మార్కును దాటాడు. షకీబ్‌కు ముందు తమీమ్‌ ఇక్బాల్‌ (389 మ్యాచ్‌ల్లో 15205), ముష్ఫికర్‌ రహీమ్‌ (438 మ్యాచ్‌ల్లో 14310 పరుగులు) బంగ్లాదేశ్‌ తరఫున ఈ రికార్డు సాధించారు. ఓవరాల్‌గా చూస్తే ప్రపంచ క్రికెట్‌లో షకీబ్‌కు ముందు 47 మంది ఈ ఫీట్‌ను దాటారు.

వీరిలో దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ (664 మ్యాచ్‌ల్లో 34357 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. సంగక్కర (28016), రికీ పాంటింగ్‌ (27483) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం క్రికెట్‌ ఆడుతున్న వారిలో షకీబ్‌ కంటే ముందుగా విరాట్‌ కోహ్లి (25385), జో రూట్‌ (18336), డేవిడ్‌ వార్నర్‌ (17267), కేన్‌ విలియమ్సన్‌ (17142), రోహిత్‌ శర్మ (17115), స్టీవ్‌ స్మిత్‌ (15084), ఏంజెలో మాథ్యూస్‌ (14231) అంతర్జాతీయ క్రికెట్‌లో 14000 పరుగుల మార్క్‌ను దాటారు.

Advertisement

Next Story