- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hoax Bomb Threats: ఎక్స్‌పై కేంద్రం సీరియస్
దిశ, నేషనల్ బ్యూరో: కొన్ని రోజులుగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా ఇలాంటి బెదిరింపు పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ.. ఎక్స్, మెటా, విమానయాన సంస్థల అధికారులతో బుధవారం వర్చువల్ మీటింగ్ నిర్వహించింది. ఈ సమావేశంలో ఎక్స్ అధికారులపై మండిపడింది. ఎక్స్ తీరును తప్పుపట్టింది. నేరాలకు ప్రోత్సహిస్తు్న్నారా? అని సీరియస్ అయింది. విమానాలకు బెదిరింపులు పోస్టు చేసినట్టుగా భావిస్తున్న ఎక్స్ యూజర్ ఐడీ లేదా డొమైన్ వివరాలను ఢిల్లీ పోలీసులకు అందించకపోవడంపై ఆగ్రహించింది.
గత ఎనిమిది రోజుల్లో సుమారు 90 దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవి దేశ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని వేస్తు్న్నాయి. ఢిల్లీ నుంచి అనేక ప్రాంతాలు, విదేశాలకు వెళ్లుతున్న ఆకాస ఎయిర్, ఇండిగో, విస్తారా విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఎనిమిది కేసులను నమోదు చేశారు. ఓ అనానమిస్ పోస్టుల నుంచి ఈ బెదిరింపు మెస్సేజీలు వచ్చినట్టు, ఆ ఖాతాను తర్వాత సస్పెండ్ చేసినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. బెంగళూరుకు వెళ్లాల్సిన ఆకాస ఎయిర్ విమానానికి ఎక్స్ వేదికగా బెదిరింపులు వచ్చినప్పుడు అక్టోబర్ 16న తొలి కేసు నమోదు చేసినట్టు వివరించారు. ఆ యూజర్ వీపీఎన్ లేదా డార్క్ వెబ్ బ్రౌజర్ ఉపయోగించి ఖాతాలను సృష్టించుకుని ఒకటి కంటే ఎక్కువ ఖాతాల ద్వారా ఈ మెస్సేజీలు పోస్టు చేశారని అనుమానిస్తున్నట్టు తెలిపారు.