- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
cyclone: వాయవ్య బంగాళాఖాతంలో తీవ్రమైన తుఫాన్
దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం రూపాంతరం చెంది మొదట వాయుగుండగా ఆ తర్వాత తుఫానుగా మారింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానికి 'దానా' తుఫాన్ ('Dana' typhoon)గా పేరు పెట్టారు. అయితే ఈ దానా తుఫాన్.. రేపు(గురువారం) వాయవ్య బంగాళాఖాతంలో(North West Bay of Bengal) తీవ్రమైన తుఫాన్‌గా మారనుంది. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం ఉదయం దానా తుఫాన్(Dana typhoon) తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ(Department of Meteorology) అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను ప్రభావంతో నేడు, రేపు సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం సాయంత్రం నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 80-100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, గురువారం రాత్రి నుంచి 100-110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కల్లోలం సృష్టిస్తాయని అధికారులు తెలిపారు. అలాగే కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాత భవనాల్లో, చెట్ల కింద ఉండవద్దని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరికలు (Warnings) జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. సముద్రం(in the sea)లో వేటకు వెళ్లిన వారిని హుటాహుటిన ఒడ్డుకు రప్పించింది. అలాగే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చేవరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.