ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించిన షెఫాలీ, లానింగ్..

by Vinod kumar |
ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించిన షెఫాలీ, లానింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముంబయిలోని బ్రాబోర్న్ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్‌ విధ్వంసం సృష్టించింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు 224 పరుగుల భారీ టార్గెట్‌ ఇచ్చింది. షెఫాలీ 31 బంతుల్లో, లానింగ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీలు అందుకోవడంతో జట్టు స్కోరు 9.4 ఓవర్లకు 100, 13.4 ఓవర్లకు 150 చేరుకుంది.

షెఫాలీ వర్మ (84; 45 బంతుల్లో 10x4, 4x6) చెలరేగి ఆడగా.. ఆమెకు తోడుగా డీసీ సారథి మెగ్‌ లానింగ్‌ (72; 43 బంతుల్లో 14x4) దంచికొట్టింది. 162 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం అందించిన ఈ జోడీని 13.3వ బంతికి లానింగ్‌ను ఔట్‌ చేయడం ద్వారా హేథర్ నైట్‌ విడదీసింది. మరో బంతి వ్యవధిలోనే షెఫాలీని పెవిలియన్‌ పంపించేసింది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ మారిజానె కాప్‌(39*; 17 బంతుల్లో 3x4, 3x6), టీమ్‌ఇండియా రాక్‌స్టార్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (22*; 15 బంతుల్లో 3x4) సిక్సర్లు, బౌండరీలు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. 18.2 ఓవర్లకే స్కోరు 200 దాటించారు. వీరిద్దరూ 31 బంతుల్లో 60 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడం తో డీసీ స్కోరు 223/2 కు చేరుకుంది.

Advertisement

Next Story