- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దంచికొట్టిన ఓపెనర్లు.. యూపీపై ఢిల్లీ మహిళల జట్టు ఘన విజయం
దిశ, స్పోర్ట్స్: ‘మహిళల ప్రీమియర్ లీగ్’(డబ్ల్యూపీఎల్)లో భాగంగా యూపీ వారియర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ.. బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన యూపీ మహిళల జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు రాధా యాదవ్ 4 వికెట్లతో రెచ్చిపోగా, మరిజెన్ కాప్ 3, అరుంధతి రెడ్డి, సుథర్లాండ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. వీరి ధాటికి యూపీ జట్టులో శ్వేత షెహ్రావత్(45) మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. వచ్చినోళ్లు వచ్చినట్టే పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 119 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక, 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మహిళల జట్టు.. కేవలం 14.3ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్లు మెగ్ లానింగ్(51), షెఫాలీ వర్మ(64 నాటౌట్) అర్ధసెంచరీలతో చెలరేగడంతో జట్టుకు సునాయస విజయం దక్కింది. 4 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన మరిజెన్ కాప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ఈ విజయంతో టోర్నీలో ఢిల్లీ విజయాల ఖాతా తెరిచింది. యూపీ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడగా రెండింట్లోనూ ఓడిపోవడం గమనార్హం.