ఒలింపిక్స్ బరిలోకి 7 నెలల గర్భిణి.. బేబీ కూడా ఫిజికల్, ఎమోషనల్‌గా ఫేస్ చేసింది.. ఇదే నా విజయం!

by Anjali |
ఒలింపిక్స్ బరిలోకి 7 నెలల గర్భిణి.. బేబీ కూడా ఫిజికల్, ఎమోషనల్‌గా ఫేస్ చేసింది.. ఇదే నా విజయం!
X

దిశ, ఫీచర్స్: నాలుగేళ్లకోకసారి జరిగే ఒలింపిక్స్‌లో తాజాగా ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. ఒలింపిక్స్‌లో విజయం సాధించేందుకు ప్రతి క్రీడాకారుడు ఎంతో కష్టపడుతారు. ఒక లక్ష్యంగా పెట్టుకుని.. ఫుడ్, బాడీ ఫిట్‌నెస్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ పోటీల్లో ఓ ఏడు నెలల ప్రెగ్నెన్సీ మహిళ బరిలో దిగడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పైగా ఈ విషయం తను చెప్పేవరకు తెలియపోవడం మరింత షాకింగ్‌గా ఉంది. వివరాల్లోకెళ్తే.. ఈజిప్షియన్ ఫెన్సర్ నాడా హాఫెజ్ అనే మహిళ ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆమె పాల్గొంది.

ప్రపంచ 10వ ర్యాంకర్ ఎలిజబెత్ టార్టకోవ్‌స్కీపై ఓపెనింగ్‌ మ్యాచ్ లో నాడా హాఫెజ్ గెలిచింది. అంతేకాకుండా 15-13 తేడాతో టార్టకోవ్‌స్కీ పై విజయం సాధించింది. 16వ రౌండ్‌ మాత్రం జులై 29 తారీకున 15-7 తేడాతో ఓటమి చవిచూసింది. ఈ సందర్భంగా ఫెన్సర్ నాడా హాఫెజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘పోడియంపై ఇద్దరు ప్లేయర్స్ పోటీ పడతారని, ఈ ఏడాది మాత్రం ముగ్గురు పోటీ పడ్డరని ఈ పోస్ట్‌లో వెల్లడించింది.మూడు సార్లు ఒలింపియన్‌గా గెలిచానని తెలిపింది. కానీ ఈసారి నాతో పాటు నా చిన్న ఒలింపియన్‌ను తీసుకువెళ్తున్నానని పేర్కొంది. ఇదే నా ఘన విజయం అని తెలిపింది. నాతో పాటు నా లిటిల్ బేబీ కూడా ఫిజికల్ గా, ఎమోషనల్ గా ఫేస్ చేసిందంటూ ఫెన్సర్ నాడా హాఫెజ్ ఎమోషనల్ గా రాసుకొచ్చింది. దీంతో నెటిజన్లంతా హాఫెజ్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story