పుణెలో జాతీయ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్..

by Vinod kumar |
పుణెలో జాతీయ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్..
X

పుణె: ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు జాతీయ ఫెన్సింగ్ పోటీలు ఇక్కడ జరగనున్నాయి. అయితే దేశవ్యాప్తంగా దాదాపు 700 మంది ఫెన్సర్లు పాల్గొనే ఈ పోటీల్లో ఒలింపియన్ సీఏ భవాని దేవీ ప్రధాన అకర్షణగా నిలవనుంది. మహారాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్, డీవై పాటిల్ అంతర్జాతీయ యూనివర్సటిలతో కలిసి ఫెన్సంగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏఐ) నిర్వహిస్తున్న ఈ చాంపియన్‌షిప్‌కు మ్లుంగే-బలేవాడిలోని శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆతిథ్యమివ్వనంది.

ఈ పోటీలు మూడు ఫాయిల్, ఎపీ, సాబెర్ కేటగిరీలలో వ్యక్తిగత, టీమ్ విభాగాలలో జరుగుతాయి. భవాని దేవి మహిళల వ్యక్తిగత సాబెర్ విభాగంలో తలపడుతుంది. ‘మేము ఫెన్సర్ల కోసం అత్యాధునిక సౌకర్యాలను అందిస్తున్నాం. చాంపియన్‌షిప్ కోసం 14 పిస్ట్‌లు సిద్ధం చేశాం. ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి ఫెన్సర్‌కు ప్రత్యేక డైటీషియన్ ద్వారా సూచనలు సలహాలతో పాటు పౌష్టికాహారం అందిస్తాం’ అని ఎఫ్ఏఐ అధ్యక్షుడు సతేజ్ పాటిల్ చెప్పారు.

Advertisement

Next Story