ఆసియా గేమ్స్ కోసం భారత కబడ్డీ జట్ల ఎంపిక..

by Vinod kumar |
ఆసియా గేమ్స్ కోసం భారత కబడ్డీ జట్ల ఎంపిక..
X

న్యూఢిల్లీ : చైనా వేదికగా జరగబోయే ఆసియా గేమ్స్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లను కేంద్ర క్రీడా శాఖ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. 12 మంది చొప్పున ప్లేయర్లతో జట్లను వెల్లడించింది. పురుషుల జట్టును రైడర్ పవన్ సెహ్రావత్ నడిపించే అవకాశాలు ఉన్నాయి. అతనితోపాటు రైడర్స్ నవీన్ కుమార్, అర్జున్ దేశ్వాల్‌‌పై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే, 2018 ఎడిషన్‌లో భాగమైన ఎక్స్‌పీరియన్స్ రైడర్లు ప్రదీప్ నర్వాల్‌, దీపక్ నివాస్ హుడాకు స్థానం దక్కకపోవడం గమనార్హం. ఆరుగురు డిఫెండర్లు ఎంపికవ్వగా.. జాబితాలో పర్వాశ్, విశాల్ భరద్వాజ్, సునీల్ కుమార్ ఉన్నారు.

అలాగే, మహిళల జట్టుకు సాక్షి కుమారి, సోనాలి విష్ణు, రితూ నెగి మహిళల జట్టుకు ఎంపికయ్యారు. గత ఎడిషన్‌లో రజతం గెలిచిన భారత జట్టులో వీళ్లు సభ్యులు. కాగా, ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభకానుండగా.. అక్టోబర్ 1 నుంచి 6వ తేదీ మధ్య కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఆసియా గేమ్స్‌లో భార‌త్‌కు తిరుగులేని రికార్డు ఉంది. 8 ఎడిషన్లలో పురుషుల జట్టు వరుసగా 7 సార్లు విజేతగా నిలువగా.. 2018లో కాంస్యంతో సరిపెట్టింది. గత నెలలో ఏషియన్ కబడ్డీ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన పురుషుల జట్టు.. ఆసియా గేమ్స్‌లో మరోసారి స్వర్ణమే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. మహిళల జట్టు 2010, 2014 ఎడిషన్లలో స్వర్ణం గెలుచుకోగా.. 2018‌లో రజతం సాధించింది.

పురుషుల జట్టు:

నితేశ్ కుమార్, పర్వేశ్, సచిన్, సుర్‌జీత్ సింగ్, విశాల్, అర్జున్ ,అస్లామ్ ఇనామ్‌దార్, నవీన్ కుమార్, పవన్ సెహ్రావత్, సునీల్ కుమార్, నితిన్, ఆకాశ్ షిండే.

మహిళల జట్టు:

అక్షిమ, జ్యోతి, పూజ, ప్రియాంక, పుష్ఫా, పూజ, సాక్షి కుమారి, రితూ, నిధి శర్మ, సుష్మా శర్మ, స్నేహాల్, సోనాలి విష్ణు.

Advertisement

Next Story