ఆ క్రికెటర్‌ను చూస్తే 1999లో నన్ను నేను చూసుకున్నట్లే ఉంది: సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Satheesh |
ఆ క్రికెటర్‌ను చూస్తే 1999లో నన్ను నేను చూసుకున్నట్లే ఉంది: సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్‌, వెరైటీ ట్వీట్స్‌తో అభిమానులతో టచ్‌లో ఉంటారు. ప్రస్తుత క్రికెటర్స్ గురించి నిర్మోహటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. బాగా రాణించిన క్రికెటర్స్‌పై ప్రశంసలు కురిపించడం, టిప్స్ చెప్పడం, ఫామ్ లేక సతమతమవుతోన్న ఆటగాళ్లు సలహాలు ఇవ్వడం, వంటివి చేస్తుంటారు.

అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ 2023లో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్ యంగ్ బ్యాటర్ తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. తిలక్ వర్మ టాలెంటెడ్ ప్లేయరని.. భవిష్యత్‌లో టీమిండియాకు ఆడే సత్తా అతడికి ఉందని పొగిడారు. అంతేకాకుండా తిలక్ వర్మను చూస్తే క్రికెట్ అరంగ్రేటం రోజుల్లో తనను చూసుకున్నట్లు ఉందని ఆకానికెత్తాడు.

ప్రస్తుతం తిలక్ వర్మ ఆట చూస్తే.. 1999లో టీమిండియా తరుఫున అరంగ్రేటం చేసినప్పుడు నన్ను నేను చూసుకున్నట్లు ఉందన్నాడు. బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణిస్తోన్న తిలక్ ఫిట్ నెస్, కొత్త టెక్నిక్స్, డిఫరెంట్ షాట్స్ ఆడటంపై దృష్టి పెట్టాలని సెహ్వాగ్ సూచించాడు. క్రికెట్‌లో మనమంటూ కొన్ని ట్రేడ్ మార్క్ షాట్స్ ఆడాలన్నాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ డిఫరెంట్ షాట్స్ ఆడుతాడని.. అతడు ఆడే షాట్స్ వేరే వారు ఆడలేరని అభిప్రాయం వ్యక్తం చేశాడు వీరూ.

అలాగే తిలక్ వర్మ కూడా స్కిల్స్, కొత్త షాట్లపై ఫోకస్ పెట్టాలని సూచనలు చేశాడు. ఇక, ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్ తరుఫున బరిలోకి తిలక్ వర్మ.. ముంబై ఇండియన్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. చాలా మ్యాచుల్లో తన అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌కు విజయాలు అందించాడు.

Advertisement

Next Story

Most Viewed