సైనా నెహ్వాల్ రికార్డును బ్రేక్ చేసిన సాత్విక్ జోడీ

by Harish |
సైనా నెహ్వాల్ రికార్డును బ్రేక్ చేసిన సాత్విక్ జోడీ
X

దిశ, స్పోర్ట్స్ : బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) మెన్స్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ జంట సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి అగ్రస్థానంలో కొనసాగుతుంది. తాజాగా ఈ జోడీ టాప్ ర్యాంక్‌లో పది వారాలను పూర్తి చేసింది. దీనిద్వారా భారత స్టార్ క్రీడాకారిణి 2015లో సైనా నెహ్వాల్ నెలకొల్పిన రికార్డును సాత్విక్ జంట బ్రేక్ చేసింది. వరల్డ్ నం.1 స్థానంలో ఎక్కువ వారాలు కొనసాగిన భారత క్రీడాకారులుగా సాత్విక్, చిరాగ్ నిలిచారు.

గతంలో సైనా నెహ్వాల్ 9 వారాలపాటు టాప్ ర్యాంక్‌లో ఉండగా.. తాజాగా ఆ రికార్డును అధిగమించారు. గతేడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన తర్వాత సాత్విక్ జోడీ తొలిసారిగా వరల్డ్ నం.1 ర్యాంక్ పొందింది. అయితే, మూడు వారాల తర్వాత అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఆ తర్వాత జనవరిలో తిరిగి టాప్ ర్యాంక్‌ సాధించగా.. ఈ నెలలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గడంతో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

Advertisement

Next Story