ఇన్నాళ్లకు కల నెరవేరిందంటూ.. టీమ్ ఇండియా యువ వికెట్ కీపర్ ట్వీట్..

by Vinod kumar |   ( Updated:2023-03-13 16:19:12.0  )
ఇన్నాళ్లకు కల నెరవేరిందంటూ.. టీమ్ ఇండియా యువ వికెట్ కీపర్ ట్వీట్..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సంజూ కలిశాడు. తను ఎంతో అభిమానించే హీరోను కలవడంతో సంజూ చాలా సంతోషించాడు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో కూడా షేర్ చేశాడు. అతని ఫ్యాన్ పేజ్ కూడా రజినీ ని సంజూ కలిసిన వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటో, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

రజినీకాంత్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిన సంజూ.. 'నాకు ఏడేళ్ల వయసున్నప్పటి నుంచే నేను రజినీ సార్‌కు పెద్ద ఫ్యాన్. అప్పుడే మా అమ్మ నాన్నకు చెప్పా.. ఎప్పటికైనా నేను రజినీ సార్‌ను ఆయన ఇంట్లోనే కలిసి తీరతాను అని. 21 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ కోరిక తీరింది. తలైవర్ నన్ను ఆయన ఇంటికి ఆహ్వానించారు' అని సంజూ ట్వీట్ చేశాడు. అయితే మరికొన్ని రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ సారధిగా సంజూ ఎంపికైన విషయం తెలిసిందే.


Advertisement

Next Story