- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడబోతున్న సానియా మీర్జా
దిశ, డైనమిక్ బ్యూరో: రెండు దశాబ్దాల పాటు తన టెన్నిస్ రాకెట్ తో సంచలనాలు సృష్టించిన భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా తన కెరీర్ కు ముగింపు పలికింది. ఇన్నాళ్లు భారత టెన్నిస్ కు అందించిన సానియా రేపు హైరాబాద్ లో ఫేర్ వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన సానియా 20 ఏళ్ల కెరీర్ తనకు సంతృప్తి ఇచ్చిందని అన్నారు. రిటైర్మెంట్ తర్వాత ఫ్యామిలీకి సమయం కేటాయిస్తానని చెప్పారు. హైదరాబాద్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని అభిమానుల కోసం రేపు చివరి మ్యాచ్ ఆడబోతున్నట్లు తెలిపారు.
భవిష్యత్ లో పిల్లలకు టెన్నిస్ లో కోచింగ్ పై దృష్టి పెడుతానన్నారు. ఆరేళ్లకు టెన్నిస్ పై ఆసక్తి పెంచుకున్న సానియా 2003లో టెన్నిస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించింది. కాగా 20 ఏళ్ల కెరీర్ లో ఆటతో పాటు సానియాను ఎన్నో వివాదాలు వెంటాడాయి. వాటన్నింటిని అధిగమించి తన కెరీర్ లో ముందుకు సాగుతూ ఎందరో యంగ్ స్పోర్ట్స్ ఉమెన్స్ కు రోల్ మోడల్ గా నిలిచారు.