పాక్ ఫైటర్‌ను చిత్తు చేసిన సంగ్రామ్ సింగ్.. ఎంఎంఏ ఫైట్‌లో చరిత్ర సృష్టించిన భారత రెజ్లర్

by Harish |
పాక్ ఫైటర్‌ను చిత్తు చేసిన సంగ్రామ్ సింగ్.. ఎంఎంఏ ఫైట్‌లో చరిత్ర సృష్టించిన భారత రెజ్లర్
X

దిశ, స్పోర్ట్స్ : భారత రెజ్లర్ సంగ్రామ్ సింగ్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఏ)‌లో తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. ఎంఎంఏ ఫైట్‌లో నెగ్గిన తొలి భారత పురుష రెజ్లర్‌గా ఘనత సాధించాడు. జార్జియాలో జరుగుతున్న గామా ఇంటర్నేషనల్ ఫైటింగ్ చాంపియన్‌షిప్‌లో సంగ్రామ్ సింగ్ అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. 93 కేజీల కేటగిరీ ఫైట్‌లో పాకిస్తాన్ ఫైటర్ అలీ రజా నాసిర్‌‌ను చిత్తు చేశాడు. నైపుణ్యాలు, వ్యూహాత్మక విధానంతో ఆధిపత్యం ప్రదర్శించాడు. 90 సెకన్లలోనే ప్రత్యర్థిపై పై చేయి సాధించాడు. ఫైట్ అనంతరం సంగ్రామ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ గెలుపు వ్యక్తిగత విజయం కంటే చాలా ఎక్కువ అని, భారత్‌లో ఎంఎంఏ గుర్తింపునకు ఇది అడుగులాంటిదని తెలిపాడు.

Next Story