Women’s T20 Asia Cup : చరిత్ర సృష్టించిన నేపాల్ మహిళల జట్టు

by Harish |
Women’s T20 Asia Cup : చరిత్ర సృష్టించిన నేపాల్ మహిళల జట్టు
X

దిశ, స్పోర్ట్స్ : నేపాల్ మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ చరిత్రలో తొలి విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంక వేదికగా శుక్రవారం ప్రారంభమైన టోర్నీలో నేపాల్ తొలి మ్యాచ్‌తోనే బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూఏఈని 6 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఖుషీ శర్మ(36) టాప్ స్కోరర్. మిగతా వారు విఫలమయ్యారు. నేపాల్ కెప్టెన్ ఇందు బర్మా 3 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేసింది.

అనంతరం ఛేదనకు దిగిన నేపాల్ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. సంఝనా ఖడ్కా(72 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిసి నేపాల్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఆమె క్రీజులో పాతుకపోయి చివరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. టోర్నీ చరిత్రలోనే నేపాల్‌కు ఇదే తొలి గెలుపు. గతంలో 2012, 2016 ఎడిషన్లలో పాల్గొన్న ఆ జట్టు 8 మ్యాచ్‌లుగా అందుల్లో పరాజయమే చవిచూసింది.

Advertisement

Next Story

Most Viewed