ఆ వ్యాధితో బాధపడుతున్నా.. సైనా నెహ్వాల్ సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |
ఆ వ్యాధితో బాధపడుతున్నా.. సైనా నెహ్వాల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తన రిటైర్మెంట్ గురించి వెల్లడించింది. ఈ ఏడాది చివరలో తన రిటైర్మెంట్ ప్రకటిస్తానని తెలిపిన సైనా.. తాను సుధీర్ఘ కాలం దేశానికి ఆడటం సంతోషాన్నిచ్చింది అని పేర్కొంది. తాను ఆర్థటైటిస్ అనే కీళ్ల నొప్పయిల వ్యాధితో బాధపడుతున్నాని, ముందులా ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేయలేకపోతున్నట్టు తెలిపింది. కీళ్ల నొప్పులు చాలా ఇబ్బంది పెడుతున్నాయని, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులతో ఆడాలంటే తాను చేస్తున్న ప్రాక్టీస్ ఏ మాత్రం సరిపోదని సైనా వెల్లడించింది. భారత తరపున ఒలంపిక్స్ లో ఆడటం ప్రతీ క్రీడాకారుణి కల అని, దానిని నేను సాధించినందుకు ఆనందంగా ఉందని తెలిపింది. స్టార్ షట్లర్ గా కొనసాగడానికి చాలా కష్టపడ్డానని, అదే విధంగా అందరి అంచనాలను మోయడం కూడా ఒక కష్టమే అని సైనా చెప్పుకొచ్చింది. ఇక అంతర్జాతీయ పోటీలకు తాను వెళ్లబోను అనే నిర్ణయమే చాలా బాధగా ఉందని, కాని నా ఆరోగ్యం సహకరించక పోవడం వల్ల మాత్రమే ఆ నిర్ణయం తీసుకుంటున్నానని సర్ది చెప్పుకుంటున్నట్టు సైనా చెప్పింది. 2012 లండన్ ఒలంపిక్స్ లో కాంస్యంతో పాటు, 2010, 2018 కామన్వెల్త్ గేమ్స్ లో సైనా స్వర్ణ పథకాలు సాధించింది.

Next Story

Most Viewed