సర్ఫరాజ్, రచిన్ రవీంద్రలపై సచిన్ ప్రశంసలు

by Harish |
సర్ఫరాజ్, రచిన్ రవీంద్రలపై సచిన్ ప్రశంసలు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్రలను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. తొలి టెస్టులో అద్భుతమైన శతకాలు చేసిన వారిద్దరిని అభినందస్తూ శనివారం ఎక్స్‌వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ‘మనం మన మూలాలతో కనెక్ట్ అవ్వడానికి క్రికెట్ ఓ మార్గం. అందుకు ఉదాహరణ రచిన్ రవీంద్రనే. బెంగళూరుతో రచిన్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అతని కుటుంబం బెంగళూరు నుంచే వెళ్లింది. అలాగే, సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ కూడా గుర్తుండిపోతుంది. భారత్‌కు కావాల్సిన సమయంలో అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ప్రతిభావంతులకు భవిష్యత్తులో మంచి రోజులు ఉన్నాయి.’అని రాసుకొచ్చాడు. కాగా, మూడో రోజు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వైపు వికెట్లు పడుతున్నా రచిన్ రవీంద్ర(134) అద్భుతమైన సెంచరీతో జట్టుకు భారీ స్కోరు కట్టబెట్టాడు. మరోవైపు, తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటై కష్టాల్లో పడిన టీమిండియాకు రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ అండగా నిలిచాడు. తొలి టెస్టు శతకాన్ని నమోదు చేశాడు.

Advertisement

Next Story