- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అందరూ తాగుతారు.. కానీ నన్ను బద్నం చేశారు: భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. 2007-2012 మధ్య భారత క్రికెట్‌లో స్వింగ్ బౌలర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ప్రవీణ్ కుమార్ అంతర్జాతీయ కెరీర్ మాత్రం ఎక్కువ రోజులు సాగలేదు. మైదానం వెలుపల అతని అలవాట్లే అందుకు కారణమని వార్తలు వచ్చాయి. తాజాగా ప్రవీణ్ కుమార్ మాజీ క్రికెటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతను.. తాను జట్టులో ఉన్నప్పుడు మిగతా వారు కూడా మద్యం సేవించేవారని, కానీ, తనపై తాగుబోతు ముద్ర వేశారని తెలిపాడు. ‘నేను భారత జట్టుకు ఆడేటప్పుడు సీనియర్లందరూ ‘తాగొద్దు, ఇలా చేయుద్దు, అలా చేయుద్దు’ అని చెప్పేవారు. అందరూ తాగేవారు. కానీ, నేను మాత్రమే తాగుతానని ప్రచారం చేసి నా పరువు తీశారు. వారు పేర్లు నేను చెప్పను. అది ఎవరో అందరికి తెలుసు. వ్యక్తిగతంగా నేను తెలిసిన వారికి నేను ఎలా ఉంటానో తెలుసు. కొందరు కావాలనే నా పరువు తీశారు.’అని వాపోయాడు. కాగా, 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టిన అతను భారత్ తరఫున 6 టెస్టుల, 68 వన్డేలు, 10 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 112 వికెట్లు తీశాడు. 2018లో ప్రవీణ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.