SA vs AUS 4th ODI: సౌతాఫ్రికా ఆటగాడు తుఫాన్ ఇన్నింగ్స్.. ఐదో వేగవంతమైన సెంచరీ

by Vinod kumar |
SA vs AUS 4th ODI: సౌతాఫ్రికా ఆటగాడు తుఫాన్ ఇన్నింగ్స్.. ఐదో వేగవంతమైన సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: సెంచూరియన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన నాలుగో వన్డేలో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 174 పరుగులు చేశాడు. క్లాసెన్‌కు తొలుత రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌ (65 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆఖర్లో డేవిడ్‌ మిల్లర్‌ (45 బంతుల్లో 82 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడవ్వడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 416 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కేవలం 57 బంతుల్లో శతక్కొట్టాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇది ఐదో వేగవంతమైన శతకం. గతంలో క్లాసెన్‌ ఓసారి 54 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ హండ్రెడ్‌ రికార్డు ఏబీ డివిలియర్స్‌ (31 బంతుల్లో) పేరిట ఉంది.

Advertisement

Next Story

Most Viewed