'బీసీసీఐ వివాదంపై RSP సీరియస్.. బీజేపీ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు'

by GSrikanth |   ( Updated:2022-10-13 03:00:50.0  )
బీసీసీఐ వివాదంపై RSP సీరియస్.. బీజేపీ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఐసీసీ చైర్మన్ పదవి దాదాపు దూరమైనట్లే కనిపిస్తోంది. 1983 ప్రపంచ కప్‌లో హీరోగా నిలిచిన రోజర్ బిన్నీ(కర్ణాటక) తదుపరి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవనున్నాడు. అయితే, ఐసీసీ అధ్యక్ష పదివి ఆశించిన గంగూలీ బీజేపీలో చేరకపోవడం వల్లే మద్దతు కోల్పోయాడని విమర్శలు వినిపిస్తున్నాయి. అమిత్ షా కుమారుడు జై షా రెండో బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగడానికి అవకాశం ఇచ్చినప్పుడు, గంగూలీని ఎందుకు తప్పిస్తున్నారని క్రీడాభిమానుల నుంచి విమర్శలు విస్తృతమయ్యాయి. తాజాగా.. ఈ వివాదంపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ''చివరికి భారత క్రికెట్‌ను కూడా వదల్లేదు బీజేపీ, అమిత్ షా గ్యాంగులు. ఇటువంటి గజదొంగల ముఠాల వెంబడి అమాయకంగా తిరుగుతూ తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్న మా హిందూ సోదరులకు ఈ పోస్టు అంకితం. అందుకే మునుగోడులో బీజేపీని ఓడించి మన బీఎస్పీకి పట్టం కడుదాం పదండి.'' అంటూ సోషల్ మీడియా వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యువతకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed