'ఆ స్టార్ క్రికెటర్ మా జట్టులో ఆడాలనుకున్నాడు'

by Hajipasha |
ఆ స్టార్ క్రికెటర్ మా జట్టులో ఆడాలనుకున్నాడు
X

వెల్లింగ్టన్: ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గురించి న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ తన ఆత్మకథ 'బ్లాక్ అండ్ వైట్' పుస్తకంలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2010లో కివీస్ తరఫున బెన్ స్టోక్స్ ఆడాలని అనుకున్నట్లు తెలిపాడు. 'బెన్ స్టోక్స్‌కు అప్పుడు 18 ఏళ్లు ఉంటాయి. న్యూజిలాండ్ తరఫున ఆడుతావా అని ఒకసారి బెన్‌ని అడిగాను. దానికి బెన్ కూడా ఆసక్తి చూపాడు. ఈ విషయంపై కివీస్ క్రికెట్ సీఈఓకి లెటర్ రాశాను. బెన్ స్టోక్స్ అనే కుర్రాడు మంచి క్రికెటర్ అవుతాడు. కివీస్ జట్టు తరఫున ఆడేందుకు ఆసక్తి చూపుతున్నాడని చెప్పా. కానీ బోర్డు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. దీంతో స్టోక్స్ వెనకడుగు వేశాడు.' అని రాస్ టేలర్ వెల్లడించాడు. కాగా, వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన బెన్ స్టోక్స్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తరఫున టెస్టులు, టీ20 ఫార్మాట్‌లో కొనసాగుతున్నాడు.

Advertisement

Next Story