ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉండాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన హిట్‌మ్యాన్

by GSrikanth |   ( Updated:2024-05-03 11:27:44.0  )
ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉండాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన హిట్‌మ్యాన్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత జట్టు సారథి రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా తప్పుకొని బ్యాటింగ్‌లో అదరగొడుతున్నారు. అయితే.. ఈ సీజన్‌లో ముంబై ఆడిన అన్ని మ్యాచులు ఓడిపోవడంతో అంతా తిరిగి జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మనే నియమించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్‌కు ఇష్టమైన మైదానం, జట్టుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు నచ్చిన స్టేడియం, ఐపీఎల్‌లో ఇష్టమైన జట్టు ఏంటో చెప్పుకొచ్చారు. అందులో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌‌కు కెప్టెన్‌గా ఉండాల‌నుంద‌ని త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టాడు. ‘నాకు ఈడెన్ గార్డెన్స్ మైదానమంటే ఇష్టం. ఇక్కడే నా కెరీర్‌ ప్రారంభమైంది. ముంబై కాకుండా కోల్‌క‌తాకు కెప్టెన్‌గా ఉండాల‌ని ఉంది’ అని హిట్‌మ్యాన్ తెలిపాడు. ఇప్పుడు అభిమానులు ఆ వీడియోను వైర‌ల్ చేస్తున్నారు.

Advertisement

Next Story