రోహిత్ ముంబై ఇండియన్స్‌తోనే కొనసాగాలి : ప్రజ్ఞాన్ ఓజా

by Harish |
రోహిత్ ముంబై ఇండియన్స్‌తోనే కొనసాగాలి : ప్రజ్ఞాన్ ఓజా
X

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చే సీజన్‌కు ముందు ఆ జట్టు నుంచి వైదొలిగి మెగా వేలంలో పాల్గొంటాడని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై భారత మాజీ క్రికెటర్, ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా స్పందించాడు. రోహిత్ ముంబై ఇండియన్స్‌తో ఆడటం కొనసాగించాలని వ్యాఖ్యానించాడు. ‘రోహిత్ ముంబై ఇండియన్స్‌లో అంతర్భాగం. అతన్ని వదులుకోవడం ఫ్రాంచైజీకి సులభమో కాదో నాకు తెలియదు. కానీ, రోహిత్‌కు మాత్రం చాలా ఎమోషనల్‌తో కూడుకున్నది. ఏం జరుగుతుందో చెప్పలేం. ముంబై ఇండియన్స్‌తోనే రోహిత్ కొనసాగాలనేది నా అభిప్రాయం. అతను ఈ స్థాయికి ఎదగడంలో ముంబై ఇండియన్స్ పాత్ర కూడా ఉంది. కాబట్టి, అతను ఆ జట్టులోనే ఉంటే మంచింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ టోర్నీ కాబట్టి ఏదైనా జరగొచ్చు.’ అని ఓజా చెప్పుకొచ్చాడు. కాగా, ఈ ఏడాది సీజన్‌కు ముందు ముంబై మేనేజ్‌మెంట్ రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు తప్పించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story