నాగ్ పూర్‌లో సెంచరీతో రెచ్చిపోయిన రోహిత్ శర్మ.. ఆధిక్యంలోకి టీమిండియా

by Satheesh |   ( Updated:2023-02-10 07:47:57.0  )
నాగ్ పూర్‌లో సెంచరీతో రెచ్చిపోయిన రోహిత్ శర్మ.. ఆధిక్యంలోకి టీమిండియా
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్ పూర్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో మెరిశాడు. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ 171 బంతుల్లో రోహిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14 ఫోర్లు, 2 సిక్సర్ల సహయంతో సెంచరీ మార్క్ అందుకున్న హిట్ మ్యాన్.. టెస్ట్ కెరీర్‌లో 9వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక, భారత్ ప్రస్తుతం 5 వికెట్లు కోల్పోయి.. 189 పరుగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజా ఉన్నారు. పూజారా 7, కోహ్లీ 12, సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ఆసీస్ అరంగ్రేట స్నిన్నర్ టాడ్ మర్ఫీ నాలుగు వికెట్లు తీసి టీమిండియా టాపార్డర్‌ను పెవిలియన్ చేర్చాడు.

Advertisement

Next Story