- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీ వచ్చినా.. ఇలానే ఉంటుంది: రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్: ఈ సిరీస్‌లో మన కుర్రాళ్లు అదరగొడుతున్నారని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. సవాళ్లు ఎదురైనా తట్టుకుని నిలబడుతున్నారని ప్రశంసించారు. నాలుగో టెస్టులో విజయం అనంతరం రోహిత్ మాట్లాడుతూ, ‘‘సవాళ్లు ఎదురైన టెస్టు సిరీస్‌లో మా యువకులు అద్భుత పోరాటంతో సత్తాచాటారు. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ గెలవడం ఆనందంగా ఉంది. నేను, కోచ్ రాహుల్ ద్రవిడ్ యువ క్రికెటర్లకు స్వేచ్ఛ ఇచ్చి, వారిపై ఒత్తిడి లేకుండా ఆడేలా చేయగలిగాం. ముఖ్యంగా జట్టు విజయంలో ధ్రువ్ కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 39పరుగులు ఎంతో విలువైనవి. సర్ఫరాజ్ ఖాన్ కూడా అరంగేట్ర సిరీస్‌లోనే సత్తాచాటాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీతోపాటు ఇతర సీనియర్లు వచ్చినప్పుడు కూడా జట్టులో మార్పుల గురించి మాపై ఒత్తిడి ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటాం. ఇక, ఐదో మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతాం’’ అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.