- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో వన్డే ఓడిపోవడానికి కారణం ఇదే : రోహిత్ శర్మ
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఓపెనర్లే కొట్టేశారు. హాఫ్ సెంచరీలతో అజేయంగా నిలిచిన మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్.. ఆసీస్‌ను కేవలం 11 ఓవర్లలోనే విజయ తీరాలకు చేర్చారు. దీనిపై రోహిత్ శర్మ స్పందించాడు. తమ బ్యాటర్లు సరిగా ఆడలేదని.. వాళ్లు విఫలం అవడంతోనే మ్యాచ్ ఓడిపోయామని అన్నాడు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఎక్కడా జట్టు కోలుకోలేకపోయిందన్నాడు. 'మేం సరిగా బ్యాటింగ్ చేయలేకపోయాం. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయాం. దీంతో కావలసినన్ని పరుగులు చేయలేకపోయాం' అని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.
ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ చాలా క్వాలిటీ బౌలర్ అని చెప్పాడు. 'అతను కొత్త బంతితో ఇలా చాలా ఏళ్లుగా రాణిస్తున్నాడు. తన బలానికి సరిపోయేలా బౌలింగ్ చేశాడు. దానికి తగ్గట్లే మేం ఆడాల్సింది. బంతి లోపలి వైపు వస్తుందా..? లేక దూరంగా వెళ్తుందా..? అని మేం ప్రతి బంతికీ గెస్ చేయాల్సి వచ్చింది' అని చెప్పుకొచ్చాడు. ఇక నిర్ణయాత్మక మూడో వన్డే బుధవారం నాడు చెన్నై వేదికగా జరుగుతుంది.