పూర్తిగా కోలుకున్న రిషబ్ పంత్.. ఫొటోలు వైరల్

by Mahesh |
పూర్తిగా కోలుకున్న రిషబ్ పంత్.. ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్.. డిసెంబర్ 30న ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం మన అందరికి తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న పంత్ కోలుకుని నెల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలోనే నెల తర్వాత అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. కాగా.. ప్రస్తుతం మోకాలికి రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ గాయలు మానగానే పంత్‌కు మరో సర్జరీ జరగనుంది.

అయితే ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన పంత్ కాలికి ఇంకా కట్టు ఉండటంతో ఎటు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి.. జాగ్రత్తలు పాటిస్తున్నారు. కాగా ప్రస్తుతం పంత్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. పంత్ కోలుకుని స్టేచర్ సహాయంతో నడుస్తుండటం ఆ ఫొటోలలో కనిపించింది. దీంతో పంత్ పూర్తిగా కోలుకుని 2023 వరల్డ్ కప్ వరకు భారత జట్టు లోకి రావాలని అతని అభిమానులు ఎంతగానో కోలుకుంటున్నారు.

కాగా పంత్ కు ఒక నెలలో మరో శస్త్రచికిత్స అవసరం ఉన్నప్పటికీ అది ఎప్పుడు చేస్తారు అనేది వైద్యులు నిర్ణయిస్తారు. అయితే బీసీసీఐ వైద్య బృందం డాక్టర్ పార్దివాలా.. నిరంతరం పంత్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం అందుతుంది. పంత్ త్వరలో మైదానంలోకి తిరిగి వస్తాడని మేము ఆశిస్తున్నాము, "అని ఒక సీనియర్ అధికారి మీడియాతో తెలిపారు.

Advertisement

Next Story