Rinku Singh: సూపర్ ఓవర్లో సిక్సర్ల వర్షం.. రింకూ సింగ్‌ విధ్వంసం

by Vinod kumar |
Rinku Singh: సూపర్ ఓవర్లో సిక్సర్ల వర్షం.. రింకూ సింగ్‌ విధ్వంసం
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా సంచలనం రింకూ సింగ్‌ మరోసారి తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు. ఐపీఎల్‌ను గుర్తుచేసే విధంగా సూపర్‌ ఓవర్‌లో ఓ మ్యాచ్‌ను రింకూ ఫినిష్‌ చేశాడు. రింకూ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా గురువారం మీరట్ మావెరిక్స్, కాశీ రుద్రస్‌ జట్లు తలపడ్డగా.. తొలుత బ్యాటింగ్‌ చేసిన మీరట్ మావెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. అయితే రింకూ మాత్రం తొలుత కేవలం 15 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. అనంతరం లక్ష్య చేధనలో కాశీ రుద్రస్‌ సరిగ్గా 181 పరుగులే చేసింది.

దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కాశీ రుద్రస్‌ 16 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ మొదలెట్టిన మీరట్ 4 బంతుల్లోనే టార్గెట్‌ను ఛేదించింది. కాశీ స్పిన్నర్‌ శివమ్‌ సింగ్‌ వేసిన సూపర్‌ ఓవర్‌లో రింకూ సింగ్‌ వరుసగా మూడు సిక్స్‌లు బాది మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్‌-2023 సందర్భంగా గుజరాత్‌ టైటాన్స్‌పై ఆఖరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది రింకూ మ్యాచ్‌ను కేకేఆర్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed