Retirement Announced: క్రికెట్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత వికెట్ కీపర్

by Shiva |   ( Updated:2024-11-04 03:50:56.0  )
Retirement Announced: క్రికెట్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత వికెట్ కీపర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత వికెట్ కీపర్ (Wicket Keeper), బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) ఆదివారం అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్లకు రిటైర్మెంట్ (Retairement) ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్ (Ranji Trophy Season) తనకు చివరి సీజన్ అని వృద్ధిమాన్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించాడు. గత నెల 40వ పుట్టిన రోజు చేసుకున్న ఈ కీపర్ 40 టెస్టులు, 9 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఎంఎస్ ధోనీ (MA Dhoni) రిటైర్మెంట్ అనంతరం కొంతకాలం టెస్ట్ క్రికెట్‌లో అతడు జట్టుకు కొన్నాళ్ల పాటు రెగ్యులర్ కీపర్‌గా ఉన్నాడు.

ఎంఎస్ ధోనీ (MS Dhoni), రిషభ్ పంత్ (Rishabha Panth) తరువాత భారత్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన వికెట్ కీపర్ల (Wicket Keepers)లో (రైట్‌హ్యాండర్) వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచంలో ఉత్తమ కీపర్‌గా భారత జట్టుకు సేవలందించిన సాహా టెస్ట్ కెరీర్‌లో 3 సెంచరీలతో పాటు మొత్తం 1,353 పరుగులు చేశాడు. తన చివరి టెస్టును మూడేళ్ల క్రితం.. 2021లో న్యూజిలాండ్‌పై ఆడాడు. అయితే, ఆ సిరీస్‌లో సాహా బాగానే రాణించినప్పటికీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Head Coach Rahul Dravid), కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma), కొత్త టీమ్ మేనేజ్‌మెంట్ బ్యాక్ అప్ కీపర్లుగా రిషభ్ పంత్ (Rishabh Panth), కేఎస్ భరత్‌ (KS Bharath)లపై ఫోకస్ పెట్టడంతో క్రమంగా వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) భారత జట్టుకు దూరం అయ్యాడు.

అయితే, రిటైర్మెంట్ విషయాన్ని సాహా ‘X’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించాడు. ‘క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన ప్రయాణం తర్వాత, ఇదే నా చివరి సీజన్. నేను రిటైర్ అయ్యే ముందు రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో మాత్రమే ఆడుతూ.. చివరిసారిగా బెంగాల్‌ (Bengal)కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ సీజన్‌ని గుర్తుంచుకునేలా చేద్దాం..!’ అంటూ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) ఎమోషనల్ అయ్యాడు.

Advertisement

Next Story
null