గిల్ దూకుడు తగ్గించుకో: యంగ్ ప్లేయర్‌కు సునీల్ గవాస్కర్ సూచన

by samatah |
గిల్ దూకుడు తగ్గించుకో: యంగ్ ప్లేయర్‌కు సునీల్ గవాస్కర్ సూచన
X

దిశ, స్పోర్ట్స్: వన్టే, టీ20ల్లో రాణిస్తున్న భారత యువ బ్యాట్స్‌మన్ శుబ్‌మన్ గిల్ ఇటీవల దక్షిణాప్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్సులో 2 రన్స్, సెకండ్ ఇన్నింగ్సులో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. అంతేగాక అతను ఆడిన గత పది టెస్టు మ్యాచుల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబర్చలేదు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గిల్‌కు పలు సూచనలు చేశాడు. టెస్టు క్రికెట్‌లో గిల్ చాలా ఫాస్ట్‌గా ఆడుతున్నాడని, దానిని తగ్గించుకోవాలని తెలిపారు. ‘వన్టే, టీ20లతో పోలిస్తే టెస్టు మ్యాచ్ కొంచెం డిఫరెంటుగా ఉంటుంది. ఎరుపు బంతి తెల్లబంతి కంటే వేగంగా కదులుతుంది. అలాగే ఎక్కువగా బౌన్స్ అయ్యే చాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి శుబ్ మన్ దానిని గుర్తుంచుకోవాలి’ అని సూచించాడు. అయితే గిల్ ఆటతీరు మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరింత కఠోర శ్రమతో శిక్షణ పొంది ఫామ్‌లోకి వస్తాడని, భవిష్యత్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తాడనే నమ్మకం ఉందని చెప్పారు.

Advertisement

Next Story